నర్సింహరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో హ్యాకథాన్‌

– విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే తమ కళాశాల లక్ష్యం : కార్యదర్శి జె.త్రిశూల్‌ రెడ్డి
నవతెలంగాణ-దుండిగల్‌
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం కళాశాలలో హ్యాకథాన్‌ కార్యక్రమం నిర్వహిస్తామని కళాశాల కార్యదర్శి జె.త్రిశూల్‌ రెడ్డి తెలిపారు. మైస మ్మగూడలోని నర్సింహరెడ్డి ఇంజనీరింగ్‌ కళా శాలలో మంగళవారం కంప్యూటర్‌ సైన్స్‌ విభా గం, వ్యాల్యూలాడెన్‌ సంస్థ ఆధ్వర్యంలో హ్యాక థాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో భాగంగా కళాశాల కార్యదర్శి విద్యార్థు లను ఉద్దేశించి మాట్లాడుతూ పలు క్లిష్టమైన సమస్యలను పరిష్కార మార్గాలు తెలుసుకునేం దుకు ,విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు, వారి ప్రతిభను వెలికి తీసేందుకు,నైపుణ్యాన్ని పెంపొందించడానికి హ్యాకథాన కార్యక్రమం ఎంతగానో ఉపయో గపడు తుందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఆర్‌ లోకనాథం మాట్లాడుతూ దైనందిక జీవితంలో విద్యార్థులు ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించ డా నికి,సంస్కతి సాంప్రదాయ, ఉత్పత్తి ఆవిష్కరణ విషయాలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడు తుంది అన్నారు. అనంతరం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి సుజిత్‌, వ్యాల్యూ లాడెన్‌ సంస్థ అధ్యక్షులు మాట్లాడారు. అనంతరం హ్యాకథాన్‌లో విజేతగా నిలిచిన వారికి నగదు బహుమతిలని కళాశాల చైర్మెన్‌ జె.నర్సింహ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ జె.నర్సింహారెడ్డి, కోశాధికారి జే. త్రిలోక్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ డా ఆర్‌ లోకనాథం విభాగాధిపతి సుజిత్‌, డీన్‌ డా. రామ సుబ్బారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త సుశీల్‌, కవిత ,రాజు పలు విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love