వన్య ప్రాణిని కాపాడిన హమాలీ కార్మికులు..

– పారెస్ట్ అధికారులకు అప్పగింత
నవతెలంగాణ- మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ పారెస్ట్  రేంజ్ పరిదిలోగల వల్లెంకుంట గ్రామ బిట్ అటవీ ప్రాంతం నుండి బుధవారం ఉదయం గ్రామ శివారులోకి వచ్చిన జింకను కుక్కలు వెంబడించి చంపడానికి ప్రయత్నించగా గమనించిన కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కాoట పెడుతున్న హమాలీ కార్మికులు, సెంటర్ నిర్బహకుడు కుక్కల భారీ నుండి జింకను కాపాడి మాజీ సర్పంచ్ శనిగరం రమేష్ ఆధ్వర్యంలో కొయ్యుర్ రేంజర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. రేంజర్ ఆదేశాల మేరకు వళ్లెంకుంట, తాడిచెర్ల సెక్షన్ ఆదికారులు ఇంతియాజ్, లక్ష్మన్ లు  గ్రామానికి చేరుకున్న అటవీ అధికారులు జింకను స్వాదీనం చేసుకొని జింకను కాపాడిన వారిని అభినందించారు. కుక్కల దాడిలో గాయపడిన జింకను చికిత్స చేయించునట్లుగా తెలిపారు.
Spread the love