కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల చేనేత పరిశ్రమ దెబ్బతింది : హేమలత

నవతెలంగాణ-హైదరాబాద్ : చేనేత కార్మికుల సమస్యల జాతీయ కన్వెన్షన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సీఐటీయూ పతాకాన్ని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె. హేమలత ఆవిష్కరించారు. అనంతరం కన్వెన్షన్ ను ప్రారంభించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల చేనేత పరిశ్రమ దెబ్బతిందని, కార్పొరేట్ శక్తులకు పెట్టుబడులు అప్పజెప్పి కార్మికుల పొట్టలు కొడుతుందని, ఆ విధానాలను తిప్పికొట్టాలని అందుకు హైదరాబాద్ లో కన్వెన్షన్ నాంది పలకాలని ఆమె పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు, జాతీయ కార్యదర్శి ఆర్. కరిమాలయన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ రమ, కురపాటి రమేష్, పి శ్రీకాంత్ లతో పాటు వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love