నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో ఓలేశ్వరం స్వయంభూ శ్రీలక్ష్మి నరసింహ స్వామివారి ఆలయంలో నెలకొన్న పద్దెనిమిది(18) అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి సహస్ర ఆకుపూజలు, కలశాభిషేకాలు, పుష్పార్చన, విశేష పూజలని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర జిల్లాల నుంచి భువనగిరి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిరికొండ శ్రీనివాస్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరికొండ అశోక్, పిట్టల శ్రీశైలం, ఎదునూరి నరేష్, కమిటీ సభ్యులు బొల్లెపల్లి మాణిక్యం, గంగదారి మల్లేశం, గోద మల్లయ్య, ఏసి కృష్ణ, నీలం భిక్షపతి, మిరియాల కిష్టయ్య, రాచమల్ల విజయ్ కుమార్,భోగ సాయి, బాత్క అశోక్ మరియు గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.