బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హనుమంత్ షిండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మీకాంత్ రావు నామినేషన్లు దాఖల

 – ఇరు పార్టీలకు చెందిన వేలాదిమంది నామినేషన్ కార్యక్రమానికి హాజరు
నవతెలంగాణ- మద్నూర్: జుక్కల్ రిజర్వ్డ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల చివరి రోజు అయిన శుక్రవారం నాడు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మీకాంతరావు తమ నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ల దాఖల కార్యక్రమానికి ఇరు పార్టీల వారు తమ కార్యకర్తలను వేలాదిగా తీసుకువచ్చారు. నా జనం ఎంత నీ జనం ఎంత అనే రీతిలో పోటాపోటీగా నామినేషన్ల కార్యక్రమానికి ఇరుపార్టీల అభ్యర్థులు కార్యకర్తలను వేలాదిగా తరలించడంతో మద్నూర్ మండల కేంద్రంలో జనాలతో దద్దరిల్లింది అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నామినేషన్ కి అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కి వేలాదిగా జనాలు తరలివస్తారని సూచన మేరకు మద్నూర్ మండల కేంద్రంలో ఎన్నికల అధికారులు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అధికారికి అందజేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి హనుమంతు సిందే నామినేషన్ దాఖల కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ క్రిస్టియన్ మైనారిటీ ఎమ్మెల్సీ టి రాజేశ్వర్ మాజీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జెడ్పి చైర్మన్ దాఫెదర్ రాజు పిట్లం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Spread the love