కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు వైసీపీ అధినేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆరోగ్యం, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఎక్స లో పోస్ట్ చేశారు. AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేశ్ కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె కవిత హ్యపిబర్త్‌డే డాడీ అని ట్వీట్ చేశారు, అనంతరం నందినగర్‌ వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన పూజలో కవిత పాల్గొన్నారు.

Spread the love