ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..

Constitution Dayనవతెలంగాణ – పెద్దవూర
భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం ప్రాథమికోన్నత పాఠశాల పోతునూరు యందు భారత రాజ్యాంగ నిర్మాత భీమ్రావు రాంజీ అంబేద్కర్ చిత్రపటానికి  ప్రధానోపాద్యా యులు వెంకట్రామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ నాయక్ ముందుగా విద్యార్థులతో భారత రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతిజ్ఞ చేయించి, అనంతరం రాజ్యాంగం యొక్క ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శ్రీమతి మెహాజబీ, గులాం అంజాద్, లావణ్య, అంజూమ్ మల్లమ్మ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love