వైకల్యం శరీరానికే గాని సంకల్పానికి కాదని ఏ వైకల్యం ఉన్నా గానీ సంకల్పం,ఆత్మ స్థైర్యం ఉంటే సాధించలేనిది లేదని,తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఎంఈవో ప్రసాదరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవం ను మంగళవారం ఘనంగా జరిపారు.ముందుగా కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ర్యాలీ ని ప్రారంభించగా పట్టణ వీధులలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పి.హరిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిధి గా విచ్చేసిన యం.ఇ.ఒ ప్రసాదరావు మాట్లాడారు.కాంప్లక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ వైకల్యం దేనికీ అడ్డు రాదని,ఆత్మస్థయిర్యంతో వైకల్యాన్ని జయిస్తూ ముందుకు కదులుతున్న దివ్యాంగులు కు ప్రభుత్వం కూడా ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. దివ్యాంగుల హక్కులు,వారి శ్రేయస్సును ప్రోత్సహించడానికే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని వాటిని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం దివ్యాంగ విద్యార్ధులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు వెంకయ్య,ఉపాధ్యాయులు కిషోర్,రాంరెడ్డి,హరిబాబు,స్పెషల్ ఎడ్యుకేటర్స్ రాంమోహన్,హరీష్,ఐ.ఇ.ఆర్.పి లు రామారావు,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.