ఘనంగా గాంధీ.. శాస్త్రి జయంతి

నవతెలంగాణ – అశ్వారావుపేట

జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతులు ను సోమవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి యు.ఎస్.ప్రకాశ్ రావు,నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి లు నేతృత్వంలో పలు పధకాల ఆశావాహులు తో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం,గాంధీ సెంటర్ లలో గల గాంధీ విగ్రహాలు కు ఎం.పి.పి శ్రీరామమూర్తి,ఆర్య వైశ్యు ప్రముఖులు పూల దండలు వేసి, శ్రద్దాంజలి ఘటించారు.
Spread the love