ఘనంగా స్వయంపాలన దినోత్సవం..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండలంలోని చినూర్ గ్రామంలో గల ఎంపీ యు పి ఎస్ పాఠశాల విద్యార్థులు స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏడవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులతో పాటు మిగతా తరగతుల విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సిహెచ్ శ్రీజ. పిఈటిగా హరీష్ .ఉపాధ్యాయులుగా మనోహర్. విష్ణు. సాయి. ప్రసాద్ .లక్ష్మణ్ .అనిల్ .రామ్ చరణ్ నందిని. స్నేహిత. వైష్ణవి. దీపిక ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, శ్రీలత. కిష్టయ్య .నసీమా తదితరులు పాల్గొన్నారు.
Spread the love