ఘనంగా సురక్ష దినోత్సవం

శాంతి భద్రతలకు పోలీసుల అత్యంత ప్రాధాన్యం : ఏసీపీ
నవతెలంగాణ నడికూడ:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం నడికూడ మండల కేంద్రంలో పరకాల పోలీస్‌ల ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరకాల ఏసీపీ జూపల్లి శివరామయ్య, సీఐ పుల్యాల కిషన్‌, ఎస్సై తూముల ప్రశాంత్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీస్‌ విభాగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్‌ క్రైమ్‌ వంటి సాంకేతికతో ముడిపడి ఉన్న నేరాల వంటి సవాళ్ళను ఎదుర్కునేందుకు పోలీస్‌ శాఖ సర్వసన్నద్ధమై ఉందఅని, మహిళల భద్రత విషయంలోనూ హౌం శాఖ పటిష్ట కార్యాచ రణను అమలు చేస్తున్నదని అన్నారు.సర్పంచ్‌ ఊర రవీందర్‌ రావు, ఎంపీపీ మచ్చ అనసూర్యరవీందర్‌, జడ్పీటీసీ కోడెపాక సుమలత కర్ణాకర్‌, బీఆర్‌ఎస్‌ నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) మాట్లాడుతూ దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ లో పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకి 331షీ టీమ్స్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ లకి కాలుష్య అలవెన్స్‌, హౌమ్‌ గార్డ్స్‌కి వేతనాల పెంపు, వేధింపులకి గురైన మహిళలు,పిల్లల సమస్యలని గుర్తించి వారికి భద్రత కల్పించడానికి భరోసా కేంద్రాలు, ఏడు సంవత్సరాలలో 28,277మంది పోలీస్‌ సిబ్బంది భర్తీ, అదనంగా 17,516పోలీస్‌ సిబ్బంది నియామకానికి నోటిఫికె షన్స్‌ జారీ చేయడం జరిగిందని అన్నారు. బీఆర్‌ఎస్వి నడికూడ మండల అధ్య క్షులు దురిశెట్టి వెంకటేష్‌, గ్రామ ప్రధాన కార్యదర్శి రావుల కిషన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నీరటి రాములు, వార్డు సభ్యులు దుప్పటి మొగిలి, గ్రామ పోలీస్‌ అధికారి నరేందర్‌ కాకతీయ ఆటో యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.
దామెర : దామెర పోలిస్‌ స్టేషన్‌ పరిధి ఊరుగొండ, తక్కలపాడు , పులకుర్తి గ్రామాల్లోని రైతు వేదికల్లో సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఎంపీపీ కాగితాల శంకర్‌ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలిస్‌ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నూతన వాహనాలు డయల్‌ 100 తో ప్రజలకు చేరు వయ్యారని అన్నారు. ఎస్సై ముత్యం రాజేందర్‌ మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో వచ్చిన మార్పులు శాంతి భద్రతల ను కాపాడటంతో పాటు ప్రజలకు దగ్గర య్యామని అన్నారు. సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాలతో నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నా రు. నేరం జరిగిన అనంతరం తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకో వడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయన్నారు. అనంతరం పోలీస్‌ శాఖ వారు ప్రగతికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వైస్‌ ఎంపీపీ జాకీర్‌ అలీ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గండు రామకష్ణ, సర్పం చులు యాద రాజేశ్వరి ఈశ్వర్‌, బింగి రాజేందర్‌, గోవింద్‌ అశోక్‌, ఉప సర్పంచ్‌ విద్యాసాగర్‌, ఏఎస్‌ఐ రాజు సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నారావుపేట: తెలంగాణ ఏర్పడిన నాటినుండి నేటి వరకు తెలంగాణ సాంకేతికతను చేరువ చేసుకొని ప్రజాసేవలో మరింత అందుబాటులో పోలీ సులు ఉంటున్నారని ఎస్సై తోట మహేందర్‌ అన్నారు. ఆదివారం మండల పరిధి లోని సర్పంచ్‌ కుండె మల్లయ్య, కోనాపురం గ్రామంలో వేల్ది సుజాత సారంగం ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్‌ పద్ధతిని ప్రవేశపెట్టిందని ఎస్సై అన్నారు . తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్‌ శాఖ తరపున అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు లైసెన్సులు తప్పకుండా కలిగి ఉండాలన్నారు. లైసెన్స్‌ లేని డ్రైవర్లకు తమ వంతు కషి చేస్తామని తెలి పారు. సైబర్‌ నేరలపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి గ్రామంలో సీసీ కె మెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జూన్‌ 12న నియోజకవర్గంలో 2కే రన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైస్‌ ఎంపీపీ కంది కష్ణారెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండి రఫీ, మాజీ జెడ్పిటిసి జున్ను తుల రామ్‌ రెడ్డి, ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ, జమీదార్‌ జన్ను స్వామి, కత్తి సురేష్‌, అరవింద్‌ పాల్గొన్నారు.
పరకాల : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు ఉత్తమ సేవ అందిస్తున్నారని సీఐ పుల్యాల కిషన్‌ అన్నారు. ఆదివారం సురక్ష పోలీస్‌ ఉత్సవాల్లో భాగంగా స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌ నుండి బస్టాండ్‌ కూడలి వరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు ,యువకులు ,అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసన కార్యక్రమంలో సిఐ కిషన్‌ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నిజాన్ని నిర్భయంగా చూపించే విధంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సిస్టంను ఏర్పాటు చేసి ప్రజలకు ఉత్తమ సేవ లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పోలీస్‌ వాహనాలను కల్పించడమే కాకుండా షీ టీమ్స్‌, పోలీస్‌ సిబ్బందిచే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సెల్‌ఫోన్‌ పోతె పోగొట్టుకున్న క్షణాల్లో దొరకబట్టే విధంగా నూతన టెక్నాలజీని తీసుకొచ్చారని అన్నారు. ఈ నెల 12న వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశం సారం ఏసిపి కార్యాలయంలో ఉదయం 6 గంటలకు టూకే రన్‌ నిర్వహిస్తామని, విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ సోదా అనిత రామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ జయపాల్‌ రెడ్డి ,ఎంపీపీ, జడ్పిటిసి ,స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆత్మకూర్‌ : ప్రజలకు రక్షణ కల్పించడంతోపాటు ప్రజాసేవయే పోలీసుల లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని ఆత్మకూర్‌ సిఐ బండారి కుమార్‌ అన్నారు. ఆదివారం ఆత్మకూరు గ్రామా పంచాయతీ లో ప్రజా అవగహనా సదస్సులో సిఐ బండారి కుమార్‌ మాట్లాడారు. ప్రజలకు,యువతకు మెరుగైన సౌకర్యాలు అందించడంతోపాటు ప్రజా సేవకు పోలీసులు అంకితమై పనిచేస్తున్నారని అన్నారు. నిస్వార్థమైన సేవలను నిరుపేద ప్రజలకు అందిస్తూ వారి మన్ననలు పోలీసులు పొందుతున్నారు. మరిన్ని సేవలు అందించేందుకు గ్రామాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు స్పెషల్‌ పార్టీ పోలీసులు నిఘానేత్రాలతో పరిశీలిస్తున్నారని అన్నారు. ఆత్మకూర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ప్రజలకు సుందరమైన పార్క్‌ తో పటు వారికీ సకల వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలు పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వంగల భగవాన్‌ రెడ్డి,ఎసై ప్రసాద్‌,సొసైటీ డైరెక్టర్‌ వీర్ల వెంకట రమణ,వర్డ్‌ మెంబర్లు బాయగాని రాజేందర్‌,పాపని రవీందర్‌,డాక్టర్‌ పూరణ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే నీరుకులల్లో జరిగిన అవగాహనా సదస్సులో సిఐ మాట్లాడారు. ఎవరికీ ఏ అవసరం వచ్చిన నేరుగా పోలీస్‌ స్టేషన్‌ కు వస్తే సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నీరుకుల్ల గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు సహకరిస్తే పూర్తి స్థాయిలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు కషి చేస్తారని అన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్తవారు కనిపిస్తే పోలీస్‌ లకు సమా చారం అందించాలన్నారు. ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షులు అర్షం వరుణ్‌ గాంధీ,సర్పంచ్‌ అర్షం బలరాం,వార్డు మెంబర్లు పాల్గొన్నార

Spread the love