ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమాన్ని శనివారం మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల కర్ల పెళ్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్తీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణా ముద్దు బిడ్డ ఆకలిమంటల కలం, పలుకుబడుల బాషా కోవిధుడు తెలంగాణా తొలి,మలి దశ ఉద్యమ దిక్సుచి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. కాళోజీ నారాయణ రావు గొప్ప రచయిత, విమర్శకుడు,విద్యావేత్త,తాత్వికుడు,మార్గనిర్దేసి,స్వభాషాభిమాని,స్వాతంత్ర్య, తెలంగాణా స్వరాష్ట్ర స్వాప్నికుడు అని కొనియాడారు గొప్పవారి జీవితాల ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈకార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ బాలు,ఏ.ఎన్. ఎం. ఆదిలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు.