తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

నవతెలంగాణ – హలియా
నరేష్ ఫౌండేషన్ చైర్మన్ గొట్టిముక్కల నరేష్

శ్రీ క్రోధనామ సంవత్సరంలో అందరికీ అన్నీ శుభాలు జరగాలని నరేష్ ఫౌండేషన్ చైర్మన్ గొట్టిముక్కల నరేష్  ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ క్రోధ నామసంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు వెల్లివిరియాలని ఆయన ఆశించారు. తెలుగు నూతన సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులకు అంతా మంచి జరగాలని కోరారు. అలాగే సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, పల్లెలు పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Spread the love