– అంగన్‌వాడీ కేంద్రాల్లో తాళాలు పగుల గొట్టిన వైనం
– సీఐటీయూ కన్వీనర్ పోచమోని కృష్ణ
– అంగన్‌వాడీల ఆధ్వర్యంలో సీఐ కాశీ విశ్వనాథ్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ-మంచాల
సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఆపాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోనీ కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరిందని, తమ న్యాయమైన సమస్యల పరిష్కారాకికి సమ్మె చేస్తుంటే ప్రభుత్వ అధికారులు వేదింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె ఉన్నా అంగన్‌వాడీ ఉద్యోగులకు అధికారులు ఫోన్లు చేసి, సమ్మె విర మించాలని లేకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. పైగా అంగన్‌వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను పగుల గొట్టిస్తున్నారని, అందులో ఉన్న రికార్డులు పోతే ఎవరు బాధ్యులు అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచాల మండల పరిధిలోని 3 కేంద్రాల్లో ఆరుట్ల 4, లింగంపల్లి 2, ఎల్లమ్మ తండా సెంటర్లల్లో తాళాలు పగుల గొట్టారని వారిపై మంచాల పోలీస్ స్టేషన్ సీఐ కాశీవిశ్వనాథ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్‌వాడీ ఉద్యో గులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ల అండ్ హెలపెర్స్ యూనియన్ నాయకులు జ్యోతి, విజయ, పద్మ, శకుంతల, వరలక్ష్మి, యాదమ్మ, లలిత, జంగమ్మ, దనమ్మ తదితరులు ఉన్నారు.