కొత్త మెను పేరుతో మధ్యాహ్న భోజన కార్మికులను వేధిస్తే ఉద్యమం తప్పదు

నవతెలంగాణ-కంటేశ్వర్
కొత్త మెనూ పేరుతో మధ్యాహ్నం భోజన కార్మికులను వేధిస్తే ఉద్యమం తప్పదని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్ లు తెలిపారు. ఈ మేరకు గురువారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి ముదక్ పల్లి కులాస్ పూర్, గ్రామంలో డిచ్ పల్లి, కేంద్రాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయకుండా, పాత బకాయిలను చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా కొత్త మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందిస్తామని ప్రకటించింది, అందుకు అనుగుణంగా స్లాబ్ రేట్లు నిర్ణయించకుండా దానిని అమలు చేయాలని స్కూల్లో ఉండే హెడ్మాస్టర్లు మధ్యాహ్న భోజన కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారు, నర్సింగ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో కొత్త మెనూ ప్రకారం వంట చేయించడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు, ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి పెరిగిన ధరలకు అనుగుణంగా స్లాబ్ రేటుని పెంచే వరకు, పెండింగ్ లో ఉన్న ఏడు కోట్ల బకాయిలను విడుదల చేసే వరకు పాత పద్ధతుల్లోనే వంట నిర్వహిస్తామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్ తెలియజేశారు.
Spread the love