IPL : టాస్ గెలిచిన హర్దిక్..ధోనిసేన బ్యాటింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 16వ సీజ‌న్‌లో ఈరోజు ఆస‌క్తిక‌ర పోరు జ‌ర‌గనుంది. క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్, నాలుగుసార్లు చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. దాంతో, ఈ స‌మఉజ్జీల పోరులో గెలిచేది ఎవ‌రు? అనే ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది. బ‌లాబాల‌ల ప‌రంగా చూస్తే రెండు జ‌ట్లు ప‌టిష్టంగానే క‌నిపిస్తున్నాయి. అంతేకాదు ఇరుజ‌ట్ల‌లో మ్యాచ్ విన్న‌ర్లు ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్ కు దిగనుంది.

Spread the love