నవతెలంగాణ – కంటేశ్వర్
పంచముఖి మున్నూరు కాపు సంఘం షిర్డీ సాయి నగర్ వినాయక నగర్ అధ్యక్షుడిగా హరిదాసు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కుల చారి సంతోష్, కోశాధికారి ఎల్మాల శంకర్ లను ఎన్నుకున్నారు.ఈసందర్భంగా నూతన అధ్యక్షులు హరిదాసు సాయి రెడ్డి మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలపరిమితి (2024-25)కోసం పంచ ముఖి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఎల్లపుడు సంఘ సభ్యులకు అందుబాటులో ఉంటానని, సంఘ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అందరి సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధిలో దూసుకుపోయేలా నా వంతు కృషి చేస్తానన్నారు. ప్రధాన కార్యదర్శి కోసం ఇద్దరు పోటీ పడగా కులచారి సంతోష్ తన ప్రత్యర్థి పై అత్యధిక ఓట్లు సాధించి గెలుపొందారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల పాటు సేవలందించిన పూర్వ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ఆమ లడ్డు శంకర్, వైసాక్షి సంతోష్, ఎల్మాల శంకర్ లను నూతన అధ్యక్ష, కార్యదర్శులు సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులను సంఘ సభ్యులు పూలమాల శాలువతో సత్కరించారు. త్వరలో మిగితా కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని అన్నారు. కార్యక్రమంలో పూర్వ అద్యక్షులు ఆమ లడ్డు శంకర్, పూర్వ ప్రధాన కార్యదర్శి వైశాక్షి సంతోష్, గౌరవ కుల పెద్దలు శ్రీశైలం, ఉప్పు సంతోష్, బంటు గంగాధర్, హరిదాసు మారుతి, బొబ్బిలి కిషన్, దారం పోతన్న,సంబారి మోహన్, మిద్దె రవి, ఆంజనేయులు, దర్మెందర్,జగదీష్, రవీందర్, శ్రీనివాస్, చిట్టి నారాయణ రెడ్డి, శ్రీనివాస్, రఘునందన్, రాజ కిషన్, కర్క రమేష్, అంజి రెడ్డి,శేని శెట్టి నాగేష్, మహేష్, తిర్మల్, నాగుర్త రాజేందర్, ముత్యం, ప్రదీప్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.