అన్ని రకాల వడ్లకు రూ.500బోనస్ ఇవ్వాల్సిందే: హరీష్ రావు డిమాండ్

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో లారీ డ్రైవర్లు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో వారు వడ్ల రవాణాకు కూడా ముందుకు రావడం లేదని తెలిపారు. తడిసిన ధాన్యానికి మొలకలు రాక ముందే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు జీలుగు, జనుము విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Spread the love