చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన హరీశ్ రావు

నవతెలంగాణ – హైదరాబాద్: చంద్రబాబును పార్టీలకు అతీతంగా ఎందరో నేతలు ఖండిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఈ వయసులో ఆయనను ఇలా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని అన్నారు. మరోవైపు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Spread the love