నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో కరెంట్ కోతలు విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరవయ్యారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంట్ కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గంటల కొద్దీ విద్యుత్ అంతరాయాలు అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని హరీశ్ రావు జత చేశారు.