రైతులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

 

CM Revanth should apologize to farmers: Harish Raoనవతెలంగాణ -హైదరాబాద్‌: రుణమాఫీ పాక్షికంగా చేశామని చెబితే ఒప్పుకొంటాం కానీ.. మొత్తం చేశామంటే అంగీకరించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ మొత్తం రూ.31 వేల కోట్లని కేబినెట్‌లో చెప్పారని తెలిపారు. కానీ రూ.14 వేల కోట్లు కోత పెట్టి మొత్తం చేశామంటున్నారని విమర్శించారు. పాక్షిక రుణమాఫీ చేసినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 46 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. ‘‘రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రుణమాఫీ సంపూర్ణంగా అయిందో లేదో రైతన్నలనే నేరుగా అడుగుదాం. రేవంత్‌రెడ్డి చరిత్ర, నా చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మాట తప్పింది ఎవరు? ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది. రుణమాఫీ, 6 గ్యారంటీలు సంపూర్ణంగా చేస్తేనే రాజీనామా చేస్తానన్నాను. ఆరు గ్యారంటీల సంగతి ఏమో కానీ, రుణమాఫీ కూడా మొత్తం చేయలేదని తీవ్రంగా విమర్శించారు.

Spread the love