సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను హరీశ్ రావు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు: కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: శాసనసభలో సోమవారం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హరీశ్ రావు ఒంటిచేత్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రులను ఎదుర్కొన్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఈ రోజు కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ తన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా హరీశ్ రావుకు కితాబిచ్చారు. హరీశ్ రావు అద్భుత ప్రసంగంతో అసెంబ్లీలో అధికార పార్టీని ఎదుర్కొన్నారన్నారు.  కృష్ణా జలాలు, కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, అబద్ధాలను హరీశ్ రావు తిప్పికొట్టారని పేర్కొన్నారు. రేపటి చలో నల్గొండకు హరీశ్ రావు సరైన టోన్ సెట్ చేశారన్నారు. కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని నల్గొండ వేదికగా కేసీఆర్ ఎండగడతారన్నారు.

Spread the love