హానికరంగా ఉన్న కరెంటు సమస్యలు పరిష్కరించాలి

– పరిష్కార వేదికలో మద్నూర్ మండల భారతీయ కిసాన్ సంగ్ అధ్యక్షులు చాట్ల గోపాల్ విన్నపం
నవతెలంగాణ – మద్నూర్
ప్రమాదాలకు హానికరం గా ఉన్న వాటి పట్ల ముందు జాగ్రత్తగా వాటిని పరిష్కరిస్తే ప్రాణ నష్టాలు జరగకుండా ఉంటాయని కరెంటు ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు పశువుల ప్రాణాలు కోల్పోయే వాటి గురించి కరెంటు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడమే ప్రాణహాని జరుగుతుందని మద్నూర్ మండల భారతీయ కిసాన్ సంగ్ అధ్యక్షులు చాట్ల గోపాల్ సమస్యల పరిష్కార వేదిక విద్యుత్ వినియోగదారుల సభకు హాజరైన ముఖ్యుల దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. కరెంటు సమస్యల పరిష్కార కోసం ఏర్పాటుచేసిన పరిష్కార వేదిక సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతున్నప్పటికీ ప్రమాదాలు జరగకముందు తీసుకోవలసిన జాగ్రత్తలు చేపట్టకపోవడమే ప్రజల ప్రాణాలు పశువుల ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని సభా దృష్టికి తెచ్చారు. వ్యవసాయ బోర్లకు కట్టెల స్తంభాల పైనే కరెంటు సరఫరా జరుగుతుందని కట్టెల స్తంభాలు ఎండకు వానకు చెడిపోయి వాటి పట్ల హాని జరుగుతుందని, మనుషులు గాని పశువులు గాని ప్రాణాలు కోల్పోతున్నారని, అదేవిధంగా ఇంటి నివాసాల పైన నుండి కరెంటు వైర్లు ఉండటం ఇంటి పనుల కోసం ఇంటిపైన ఏదైనా పని చేయాలంటే కరెంటు వైర్ల ద్వారా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి ప్రమాదకరమైన సమస్యలు శివారు ప్రాంతాల్లో కట్టెల స్తంభాలు ఇండ్ల నివాసం పైన కరెంటు వైర్లు కండ్లకు కనిపిస్తుంటే కరెంట్ అధికారులు వాటిని పరిష్కరించకపోవడం ప్రమాదాలకు గురికాక తప్పడం లేదని, ప్రమాదాలు జరిగే ప్రాణాలు కోల్పోతే ప్రాణ నష్టం ఇవ్వడం సరైంది కాదని, పరిష్కార వేదిక ఇలాంటి ప్రమాదకరమైన సమస్య ముందుగా పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ పరిష్కార వేదికలో పలు గ్రామాల నుండి సమస్యల వినతులు నివేదిక అధికారులకు పలువురు అందజేశారు. మద్నూర్ భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షులు సూచించిన మార్గం మంచిదని ఇలాంటి ప్రమాదకరమైన కరెంటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని పరిష్కార వేదిక సంబంధిత సబ్ స్టేషన్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వేదిక కార్యక్రమంలో ఎస్ రామకృష్ణ చైర్పర్సన్ టెక్నికల్ మెంబర్ ఎల్ కిషన్ నెంబర్ ఫైనాన్స్ ఎం రాజా గౌడ్ ఫోర్త్ మెంబర్ వీరితోపాటు మద్నూర్ మండలం తో పాటు వివిధ మండలాల నుండి సబ్స్టేషన్లో వారీగా ట్రాన్స్కో ఏ ఇల్లు సంబంధిత సిబ్బంది భారతీయ కిసాన్ సాంగ్ వివిధ మండలాల అధ్యక్షులు కరెంటు వినియోగదారులు పాల్గొన్నారు.
Spread the love