హర్టయ్యావా..! అమ్మమ్మా!?

”వేడి మీదనే లోహాన్ని మనకిష్టమైన ఆకతిలో మార్చుకోవచ్చన్న” సత్యాన్ని తెలిసిన అన్నపూర్ణమ్మ, ఆ నలుగురూ వినేలా తన మనసులోని బాధను, పిల్లల పట్ల పెద్దవాళ్ల బాధ్యతను, వాళ్లకందించాల్సిన ప్రేమాభిమానాలతో పాటు మన దేశ మహౌన్నత సంస్కతిని గురించి చెబుతూ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. అంతా వింటున్న మనుమడు ఒక్క ఉదుటున అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు. కింద నుండి లేపి జాగ్రత్తగా పట్టుకుని తీసికెళ్లి, మంచం మీద పడుకోబెట్టాడు. చల్లని నీళ్లతో ముఖం తుడిచాడు. కొద్ది సేపటికి నెమ్మదిగా కళ్లు తెరిచిన అన్నపూర్ణమ్మతో ”హర్టయ్యావా… అమ్మమ్మా! మమ్మల్ని క్షమించు”
”ఏం రా! తెలుగు మాట్లాడరా! మీకసలు రాదా?” అనగానే…
”తెలుగా” పరిహాసంగా నవ్వుతుంటే…
అంతలో సుజాత కల్పించుకుని ”వాళ్ళకు అమెరికా పోవాలని కోరికమ్మా. అందుకే తెలుగు మాట్లాడటం మానేశారు”.
వెళితే మాత్రం అలా చేయడమేమిటి? ఇంత పెద్ద ఇంట్లో అవసరం లేని విశాలమైన గదులెన్నో ఉన్నాయి. కానీ విశాలమైన మనసులే లేవనుకుంది అన్నపూర్ణమ్మ
అన్నపూర్ణమ్మ మనసు పురివిప్పిన నెమలిలాగుంది.. కాలు ఒక చోట కుదురుగా నిలవడం లేదు.
అమెరికా పోయొచ్చిన దాని కంటే ఎక్కువగా సంతోషపడుతున్న భార్యను చూసి, నారాయణరావు తనూ అందులో పాలు పంచుకుని ఆనంద పడుతున్నాడు
అంతే కదా..’పెళ్లినాడు మర్యాదలు, పెట్టుబోతలు సరిగా లేవని, తమ అంతస్తుకు తగ్గట్టుగా చూడలేదని వియ్యాలవారితో పాటు అలిగిన అల్లుడు.. మూడు నిద్రలు ముచ్చట్లేమీ లేకుండానే కూతురిని తీసుకొని పోయాడు.
పురుళ్లు పుణ్యాల అవసరాలకు అన్నపూర్ణను మాత్రమే పిలిపించుకుని, పిల్లలకు సేవలు చేసే ఆయాలా చూసాడే తప్ప అత్తగారిని ఏనాడూ అభిమానంగా, గౌరవంతో చూడలేదు.
కూతురూ అల్లుడి చేతి కీలుబొమ్మలా మారి తనతో అంటీ ముట్టనట్టుగా ఉండేది. ఆ విషయాన్ని భర్తతో చెప్పి గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే వుంటుంది.
****
అలాంటి కూతురు మనుమడు, మనుమరాలితో కలిసి ఫోన్‌ చేసి ”వురు మిస్‌ యూ! రా! అమ్మా, అమ్మమ్మా! అన్న మాటలు వారి చెవుల్లో అమృతధారలు కురిపించినట్టయింది.
భర్తతో ఇద్దరం కలిసి వెళ్దాం రమ్మంది. ‘తనైతే పేగుబంధం కోసం మాట పట్టింపులను ఎప్పటికప్పుడు తుడిచేసుకుంది’ కానీ నారాయణరావు మనసులో అల్లుడు చేసిన గాయమింకా పచ్చిగానే వుంది.
”ముందు నువ్వెళ్ళవోరు” తర్వాత నేనూ వస్తా”నంటూ మాట దాట వేశాడు.
భర్త మనసు తెలిసిన అన్నపూర్ణమ్మ ఇక బలవంతం చేయదలచుకోలేదు.
****
అన్నపూర్ణమ్మ హడావిడి అంతా ఇంతా కాదు. వారం రోజుల పాటు పొయ్యి మీది మూకుడు దించకుండా రకరకాల పిండివంటలు చేసింది. ఇంట్లోని పచ్చళ్లను ప్యాక్‌ చేయించింది. భర్తతో కలిసి జువెలరీ షాపుకెళ్లి మనుమరాలికి ‘వంకీలు వడ్డాణం, పాపిటబిళ్ల స్వాతి హారం’ ఆర్డరిచ్చింది. బట్టల షాపుకెళ్లి పద్నాలుగేళ్ల మనుమరాలు ఎంతుంటుందో ఊహించుకుని ‘పట్టు పరికిణీ వోణీలు’ కొన్నది.
బిడ్డకు పట్టు చీరలు, అల్లుడికి, మనుమడికి ఖరీదైన డ్రస్సులు కలిసి కొన్నారిద్దరు. అయినా లోలోపల తెలియని ఉత్కంఠ, సంశయం పట్టి పీడిస్తూ ఉన్నాయి.
నారాయణ రావు ముంబైకి తత్కాల్‌లో టికెట్‌ బుక్‌ చేశాడు. వెళ్లేటపుడు ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకున్నారు.
కోటి కాంతుల ఆనందాన్ని నింపుకుని వయసును మరచి పరుగులు తీస్తూ వెళ్తున్న భార్యను చూస్తుంటే కొద్దిగా అసూయగా అనిపించింది నారాయణరావుకు. ‘పసిమొహాలను చూసింది. సేవ చేసి తరించింది.’ మరితానో ఇంతవరకూ వాళ్ల ముద్దు ముచ్చటకు నోచుకోలేదు. ‘పిలవని పేరంటం చెప్పని ఒక్కపొద్దు అన్నట్టు’ తనను ఏనాడూ రమ్మని అల్లుడు పిలవలేదు. తనంత తనుగా వెళ్ళడానికి అహం అడ్డొచ్చి వెళ్ళలేక పోయాడు.
****
రైల్వే స్టేషన్లో రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చిన కూతురు సుజాతను ముందు గుర్తు పట్టలేదు. ”మోకాళ్లు దాటే జడ ఇప్పుడు పోనీటైల్‌ గా మారింది. జీన్‌ ప్యాంట్‌ డ్రస్సులో కొత్తగా కనిపించింది.
”హారు అమ్మా! హౌ ఆర్యూ!” అన్న కూతురు మాటలు అర్దమయ్యి, బాగానే వున్నానని తల పంకించింది. దారిలో మొత్తం సంభాషణంతా హిందీ, ఇంగ్లీషులో జరుగుతుంటే అన్నపూర్ణమ్మలో ఉత్సాహం నెమ్మది నెమ్మదిగా నీరుగారి పోసాగింది.
ఆ రోజు ఆదివారం అంతా ఇంట్లోనే వున్నారు. అన్నపూర్ణను చూసి ఎవరో అపరిచితురాలు అన్నట్టుగా, పలకరించకుండా తమ పనులలో నిమగమై వున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టిన వ్యక్తిని పలకరించడమన్నది కనీస మర్యాద, సంప్రదాయం. మరి వీళ్లేమిటి ఇలా? అసలు ఫోన్లో మాట్లాడింది వీళ్లేనా..?తనేమైనా పొరపాటు పడిందా..? అంతర్మధనం మొదలయ్యింది అన్నపూర్ణలో.
తనకు తనే మనసుకు సర్ది చెప్పుకుంది. అల్లుడిని నమస్కారంతో పలకరించింది. ప్రతి నమస్కారం కూడా చేయకుండా అు… అని గదిలోకి వెళ్లిపోతున్న అల్లున్ని చూసి నిశ్చేష్టురాలయ్యింది.
మనుమడు చెవులలో తీగలేవో పెట్టుకొని ఇతరులను గమనించే స్థితిలోనే లేడు. ఇక మనుమరాలు ఫోనులో ఎవరితోనో నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడుతోంది.
‘అసలెందుకొచ్చానా? రెక్కలుంటే బాగుండు ఎగిరి పారిపోదును’ అనిపించింది అన్నపూర్ణకు.
కూతురు సుజాత వాళ్ళ దగ్గరకు వెళ్ళి కుదిపి చెబితే. ”హారు!” అని వారి లోకాల్లో వాళ్లు మునిగి పోయారు.
అప్పటి వరకూ పాతికేళ్లు వయసు తగ్గినట్టుగా పరుగులు పెట్టిన అన్నపూర్ణమ్మకు ఇప్పుడు పాతికేళ్లు మీదబడ్డట్టయ్యింది.
కూతురే తల్లిని ఫ్రెషప్‌ అవమనీ ఆమె కోసం కేటాయించిన రూమ్‌ చూపెట్టింది. తలార స్నానం చేసి వచ్చేసరికి ప్రయాణ బడలిక తీరింది. ఏదైనా తినడానికి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుంది. పనమ్మాయి చేసిన వంటలన్నీ అలాగే వున్నాయి.
”అదేమిటమ్మా! మీరు తినలేదా?” అనుమానంగా కూతురును అడిగింది.
”రోజూ ఇంతేనమ్మా! వంటమనిషికి ఇది చెయ్యి అది చేయి అని ఆర్డరిస్తారు. అంతలోనే మరో నౌకరుతో హోటల్‌ నుండి ఇష్టమైనవి తెప్పించుకుంటారు” అంది.
”ఎంత సిరి వుంటే మాత్రం ఇంత దుబారానా!” బుగ్గలు నొక్కుకుంటూ ”వీళ్ళనేమైనా మార్చగలనా!” అనుకుంది అన్నపూర్ణ.
అక్కడ వాళ్లనలా చూసిన తర్వాత, తను తెచ్చిన వస్తువులు చూపించాలన్న ఉత్సాహమే పోయింది ఆమెలో…
ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చిన మనుమడు, మనుమరాలు ”హారు! అమ్మమ్మా!” అంటూ పలకరించారు. అదీ ఇంగ్లీషులోనే.
”ఏం రా! తెలుగు మాట్లాడరా! మీకసలు రాదా?” అనగానే…
”తెలుగా” పరిహాసంగా నవ్వుతుంటే…
అంతలో సుజాత కల్పించుకుని ”వాళ్ళకు అమెరికా పోవాలని కోరికమ్మా. అందుకే తెలుగు మాట్లాడటం మానేశారు”.
వెళితే మాత్రం అలా చేయడమేమిటి? ఇంత పెద్ద ఇంట్లో అవసరం లేని విశాలమైన గదులెన్నో ఉన్నాయి. కానీ విశాలమైన మనసులే లేవనుకుంది అన్నపూర్ణమ్మ.
****
తను తెచ్చిన పిండివంటలు పచ్చళ్లను ఫ్రిజ్లో పెట్టింది. బట్టలు, నగలు తనకిచ్చిన రూమ్‌ లోని బీరువాలో దాచేసింది.
ఆ రాత్రి తన బాధనంతా కన్నీళ్లతో తలగడకు పంచి, వెక్కి వెక్కి ఏడ్చి గుండెలోని భారాన్ని దింపుకుంది అన్నపూర్ణమ్మ.
****
పొద్దున్నే లేచి తయారయి వంటగదిలోకి వచ్చింది. స్నానాదికాలు కాగానే భర్తతో కలిసి టీ తాగే అలవాటుంది తనకు. ‘వంట మనిషేమో ఇంకా రాలేదు. ఎక్కడ ఏమున్నాయో తెలియదు’ మనసులో అనుకుంటుండగానే తల్లి అలికిడికి సుజాత లేచింది.
”హారు! అమ్మా గుడ్‌ మానింగ్‌” అని పలకరించింది. టీ తల్లికి ఇచ్చి, తనకూ కాఫీ తెచ్చుకుని తాగుతున్న కూతురు వంక చిత్రంగా చూసింది.
పిల్లలంటే వేరు దీనికేమయింది? ”సుఖమొస్తే ముఖ కడుగ దీరదన్నట్టు”.
తల్లి మనసులో భావాన్ని కనిపెట్టి ”దీనిని బెడ్‌ కాఫీ అంటారమ్మా !” అంది.
అల్లుడూ పిల్లలది అదే తంతు. వంట మనిషి వచ్చింది. మెనూ అడిగి టకాటకా శాండ్విచ్‌లు, బర్గర్లు ఇంకేమిటో తనకు తెలియనివి చేసి పెట్టింది.
ఏవీ గొంతు దిగలేదు అన్నపూర్ణమ్మకు.
ఆమె అవస్థ చూసి పిల్లలూ అల్లుడూ ”విలేజ్‌ కదా ఏం తెలుస్తారు” వ్యంగ్యంగా అనుకొని నవ్వుకుంటుంటే…
”ఈ వయసులో నన్ను పిలిపించుకుంది. ఇలా ఏడిపించడానికా?’ అనుకుంది బాధగా.
పిల్లల వేషధారణ చూసి నివ్వెరబోయింది.. పొట్టి డ్రస్సులో ఒళ్ళంతా కనబడేలా మనుమరాలు, ప్యాంట్‌ షర్టులో కూతురు. తనున్నది అమెరికాలోనా అనే భ్రమ కలిగింది.
ఖాళీగా వుండటం ఇష్టం లేక తనూ జాబ్‌ చేస్తున్నాననీ, తల్లికి కొన్ని జాగ్రత్తలు చెప్పింది. తను ఈవినింగ్‌ ఫైవ్‌ ఓ క్లాక్‌ వరకల్లా వచ్చేస్తానని చెప్పి వెళ్ళి పోయింది.
‘యధారాజా తదా ప్రజా అంటే ఇదే కదా!’ అనుకుంటూ ఓపికున్నంత వరకు ఇల్లంతా సర్దింది. బాసుమతి బియ్యం కనబడితే వాటినే వుడకేసుకుని అందులో తను తెచ్చిన పచ్చళ్ళను కలుపుకుని తిన్నది.
మధ్యాహ్నం ఎవరో ఆడామగా పిల్లల్ని అరడజను మందినేసుకుని వచ్చాడు బీ టెక్‌ చదువుతున్న మనుమడు.
వాడి గదిలోకి వెళ్తూ అక్కడ కనబడిన అమ్మమ్మను చూపుతూ… ”షి ఈజ్‌ మై గ్రాండ్‌ మా! తెలుగు తప్ప మరేం రాదు” పరిచయమైనా చేయకుండా వాళ్ళను తీసికెళ్లాడు.
లోపల ఒకటే ఇకఇకలు పకపకలు, పెద్ద సౌండ్‌ తో మ్యూజిక్‌ పెట్టుకుని డ్యాన్సులు.
వాళ్ళను కిటికీలోంచి చూసి ఏం చేయాలో అర్ధం కాక తలపట్టుకుంది.
తల్లి వచ్చే టైమ్‌కు బయటకెళ్ళడం. ఎప్పుడో ఏడింటికి రావడం. చదివి చదివీ అలసి పోయిన వాడిలా నటించడం. మనుమరాలు కూడా అదే తరహా. ఇంటికి వచ్చాక కూడా ఆపకుండా సెల్‌లో ఎవరితోనో గంటలు గంటలు ముచ్చట్లు.
‘ఎవరికి వారే యమునా తీరేలా వుంది’. మనుమడి విషయం కూతురుకు చెప్పాలా! వద్దా? తెలియడం లేదు. రోజులు గడుస్తున్నాయి.
****
యధా ప్రకారం స్నేహితులను వెంటేసుకొచ్చిన మనుమడు గదిలో ఆరోజు మ్యూజిక్‌ కాకుండా మరేదో పెట్టుకుని చేతుల్లో కూల్‌డ్రింక్‌ గ్లాసులు పట్టుకుని తాగుతూ ఒకరిపై ఒకరు పడి వంటి మీద స్పహ లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూడలేక పోయింది.
అశ్లీలమైన సినిమా అది.
ఈ మధ్య తలుపులు వేసుకోవడం లేదు. ‘ముసల్ది ఏం చేస్తుందిలే అన్న ధీమా!’
అది చూసిన అన్నపూర్ణమ్మకు రక్తం సలసల మసిలి పోయింది. కోపం నషాలాకు అంటింది. వెళ్ళి ప్లగ్‌, కనెక్షన్‌ పీకేసింది. ఒంట్లో బలాన్నంతా ఉపయోగించి మనుమడి చెంపల్ని పటాపటా వాయించింది. అలాగే అక్కడున్న ఆడామగా అందరి చెంపలు పెడీపెడీమని వాయించింది. హఠాత్తుగా జరిగిన సంఘటన నుంచి వాళ్ళింకా తేరుకోలేక పోతున్నారు. వాళ్ళకేం అర్థం కావడం లేదు.
కూల్‌ డ్రింక్‌ పేరుతో వాళ్ళు తాగేది మందని అర్ధమయ్యింది. ఫ్రిజ్‌ లోని నీళ్ళ బాటిళ్లు తెచ్చి మనుమడి మీద, వాళ్ల మీద గుమ్మరించింది.
మనుమడికి బలవంతంగా మజ్జిగ తాగించడంతో చాలా సేపటికి మత్తు దిగి మామూలు మనిషయ్యాడు. ఎదురుగా అమ్మమ్మ పులిలా ఉగ్రరూపంతో కనిపించేసరికి బిత్తరబోయాడు. జరిగిందంతా కొద్దికొద్దిగా గుర్తుకు వచ్చి తన చుట్టూ చూశాడు. వాళ్లింకా మత్తులోనే జోగుతున్నారు.
తను చేసిన తప్పు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్న మనుమడితో వాళ్లను లేపించింది. మత్తునుండి ఒళ్లు విరుచుకుంటూ లేచిన వాళ్ళను పంపించేసింది. మొత్తం గదంతా నీట్‌గా సర్ధి మనుమడిని దగ్గరకు తీసుకుని తన చేతివేళ్ల అచ్చులతో కంది పోయిన బుగ్గలను తడిమి భోరుమని ఏడ్చింది.
”ఏం రా! నేను ఎన్నో ఊహించుకున్నాను. మిమ్మల్ని గొప్పగా చూసి తరించి పోదామని, మీ మాటలకు మురిసిపోయి వచ్చానురా!”
”నన్ను మీరు పట్టించుకోకపోయినా ఫరవాలేదు. కానీ మీ భాష, వేష ధారణ, అలవాట్లు ఇంత దారుణంగా వుంటాయని ముందే తెలిస్తే ఈ గడప తొక్కేదాన్ని కాదురా! డబ్బు మనిషిని దిగజార్చకూడదు. చదువు సంస్కారాన్ని నేర్పాలి. మన పద్ధతులు అలవాట్ల గొప్ప తనం చూసి, వాళ్లు ఆదర్శంగా తీసుకుని పాటిస్తుంటే, మీరేమో యిలా! అసహ్యంగా…!” మాటలాపేసి మనుమడి వైపు చూసింది.
అన్నపూర్ణమ్మ కొంగులో ముఖం దాచుకుని చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ కన్నీళ్లతో… ”తప్పయిపోయింది అమ్మమ్మా! ఇంట్లో మంచీ చెడు చెప్పేవారు లేరు. కావలసినంత డబ్బు ఇచ్చారే కానీ ఇలా మాకు మంచి మాటలెప్పుడూ చెప్పలేదు. ఎవరి ఫ్రెండ్స్‌తో వాళ్లం ఎంజారు చేయడమే జీవితమని అనుకున్నా అమ్మమ్మా!” అన్నాడు.
‘నిజమే కదా! వీళ్ల తప్పేముంది. డబ్బులివ్వడమే తెలుసు గానీ, ఈ వయసులో పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలాంటి వారితో తిరుగుతున్నారు. అసలు పిల్లలకు ఏం కావాలో తెలుసుకోక పోవడం తల్లిదండ్రులదే అసలు తప్పు.’
ఆలోచిస్తూ వాడికి జీవితమంటే ఏమిటో తన అనుభవాలను రంగరించి రోజూ చెప్పడం మొదలు పెట్టింది. మనుమడిలో వస్తున్న మార్పును గమనించసాగింది.
****
ఆరోజు మనుమరాలి పుట్టిన రోజని అల్లుడు బిడ్డా చేసే ఆర్భాటం, హడావిడి చూస్తూనే వుంది.
మనుమరాలిని దగ్గరకు తీసుకోబోతుంటే ‘ఛీ! ఛీ! ముసలి వాసన’ అంటూ దూరం జరిగిన కూతురిని చూసి నవ్వుతూ
”అలా అయితే అమ్మమ్మకు సెంటు కొడదామా” అంటున్న తల్లినీ, అన్నపూర్ణమ్మను మార్చి మార్చి చూశాడు మనుమడు.
అది విన్న అన్నపూర్ణమ్మ ముఖం మీద చిరునవ్వు చెరగనీయకుండా… ”అవునురా అమ్మడూ! నాది ముసలి వాసనే! ఈ ఒక్కసారికి నా వాసన భరించి నేను చెప్పిన మాట వినురా” బతిలాడింది.
”పాపం పోనీలే ఈ ఒక్కసారికి విను” అంటున్న కూతురు మాటలకు ఒప్పుకున్న మనుమరాలిని తనున్న గదిలోకి తీసికెళ్లింది.
మనుమరాలికి తను తెచ్చిన పట్టుపరికిణీ వోణీ వేసింది. పోనీటైల్‌ ను తీసి తన సవరంతో పొడవాటి జడ అల్లింది.
మనుమడితో పూలు తెప్పించి, జడ పొడవునా కట్టింది. తెచ్చిన నగలను అలంకరించింది. ముద్దుగా సంప్రదాయ దుస్తుల్లో, అందంగా కనిపిస్తున్న కూతురిని చూసి మురిసిపోతున్న అల్లుడూ, బిడ్డల కళ్ళల్లో మెరుపులను గమనించింది.
మనుమరాలికి ఇదంతా కొత్తగా ఆనందంగా వుంది.
”వేడి మీదనే లోహాన్ని మనకిష్టమైన ఆకతిలో మార్చుకోవచ్చన్న” సత్యాన్ని తెలిసిన అన్నపూర్ణమ్మ, ఆ నలుగురూ వినేలా తన మనసులోని బాధను, పిల్లల పట్ల పెద్దవాళ్ల బాధ్యతను, వాళ్లకందించా ల్సిన ప్రేమాభిమానాలతో పాటు మన దేశ మహౌన్నత సంస్కతిని గురించి చెబుతూ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది.
అంతా వింటున్న మనుమడు ఒక్క ఉదుటున అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు. కింద నుండి లేపి జాగ్రత్తగా పట్టుకుని తీసికెళ్లి, మంచం మీద పడుకోబెట్టాడు. చల్లని నీళ్లతో ముఖం తుడిచాడు. కొద్ది సేపటికి నెమ్మదిగా కళ్లు తెరిచిన అన్నపూర్ణమ్మతో ”హర్టయ్యావా…అమ్మమ్మా! మమ్మల్ని క్షమించు” అంటున్న పిల్లలూ, వారితో పాటుగా అల్లుడూ బిడ్డ కళ్ళతోనే వేడుకుంటుంటే తప్తిగా నవ్వింది.
”ఒరేరు మనవడా! మరిచి పోయావా..? ఈరోజే కదా నా ప్రయాణం అంది.. ముగ్గురు తెల్లబోయి చూస్తుంటే ..
”అవునమ్మా! తాతయ్య టికెట్‌ బుక్‌ చేశాడట. నాకు ఫోన్‌ చేసి చెప్పాడు” అన్నాడు.

Spread the love