హారు నాన్న.. అలాంటి గొప్ప అనుభూతినిచ్చింది

Haru dad.. such It felt greatనాని నటించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హారు నాన్న’. వైర ఎంటర్‌టైన్‌ మెంట్‌ మొదటి ప్రొడక్షన్‌ వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, శ్రుతి హాసన్‌ కీలక పాత్ర పోషించారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమా నేడు (గురు వారం) గ్రాండ్‌గా విడుదలౌతుంది.ఈ నేపథ్యంలో హీరో నాని మీడియాతో మాట్లాడుతూ, ”హారు నాన్న’ చాలా హ్యాపీ ఫిల్మ్‌. ‘జెర్సీ’ చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో ఒక రకమైన ఎమోషన్‌ ఉంటుంది. కానీ ఈ సినిమాకి మాత్రం ప్రేక్షకులు నవ్వులతో బయటికి వస్తారు. ఈ ఆనందంలోనే మనసుని హత్తుకునే ఎమోషన్‌ హై ఉంటుంది.దసరా తర్వాత మాస్‌ ఇమేజ్‌ వచ్చింది కదా మళ్ళీ ఇలాంటి సాప్ట్‌ సినిమా చేశారేంటి అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఇమేజ్‌ కోణంలో చూడను. కథ నచ్చిందనే ‘దసరా’ చేశాను. ఈ కథ నచ్చిందనే ఇప్పుడు ఈ సినిమాలో నటించాను. ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా. టార్గెట్‌ ఆడియన్స్‌కి ఇది ఫేవరేట్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలుస్తుంది. దర్శకుడు శౌర్యువ్‌ ఈ కథ చెప్పినప్పుడే చాలా హై ఇచ్చింది. యాక్షన్‌ సినిమాల్లో ఒకరకమైన ఎనర్జీ ఉంటుంది. ‘యానిమల్‌’తో సహా ఈ ఏడాది వచ్చిన చాలా యాక్షన్‌ సినిమాలు కావాల్సిన దానికంటే ఎక్కువగానే స్పైసీని పంచాయి. అయితే స్పైసీ తర్వాత స్వీట్‌ క్రేవింగ్‌ ఉంటుంది. ఆ స్వీట్‌ని ఇచ్చే సినిమాలే లేవు.ఈ సినిమా ఆ లోటుని తీరుస్తుంది.ఈ ఏడాది అన్ని ఐటమ్స్‌ పెట్టారు కానీ ముగించే ఐటెం నేను పెడతా(నవ్వుతూ).ఈ సినిమా ఫలితంపై నమ్మకంగా ఉండటానికి కారణం ‘హారు నాన్న’ కంటెంటే. ఏదైనా సినిమాని చూసినప్పుడు అది నచ్చితే మొదట సోషల్‌ మీడియాలో సినిమాని అభినందిస్తూ పోస్ట్‌ పెడతాను. తాజాగా వచ్చిన ‘యానిమల్‌’ కూడా అలా చేశాను. అది ఒక ప్రేక్షకుడిగా నా అనుభూతి. ‘హారు నాన్న’ని ఒక ప్రేక్షకుడిగా చూసినప్పుడు అదే గొప్ప అనుభూతి కలిగింది.వైర బ్యానర్‌లో ఇది తొలి సినిమా కాబట్టి ప్రమోషన్‌ బాధ్యతలను కూడా నేనే తీసుకున్నా. అంతేకాదు ఓ నటుడిగా నేనే చేయాలి. ఇది వాళ్ళకి మొదటి సినిమా. ఎన్నో విషయాలని వాళ్ళు అర్ధం చేసుకోవాలి. గైడెన్స్‌ అవసరం. నాకున్న అనుభవంతో అన్నీ చేశా.

Spread the love