హర్యానా సీఎం రాజీనామా

నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల వేళ హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హర్యానా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్‌కు అందించారు. ఖట్టర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు హర్యానా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఖట్టర్ రాజీనామాకు గల కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట సీఎం రాజీనామా హర్యానా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Spread the love