మానకొండూర్ లో ‘హస్తం’ విజయదరహాసం.. 

– మండలంలో అంబరాన్నింటిన విజయోత్సవ సంబురాలు
– పదేండ్ల తర్వాత పాగ వేసిన కాంగ్రెస్ పార్టీ
– సుమారు 31,743 ఓట్ల అధిక్యంతో విజయసాదించిన కవ్వంపల్లి
నవతెలంగాణ-బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గంలో అదివారం’హస్తం’సునయాసనంగా విజయదరహాసం ఎగురవేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పై సుమారు 31,743 ఓట్ల భారీ మేజారిటీతో విజయం సాధించారు. 2009లో ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా 2014,2018 జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రసమయి బాలకిషన్ రెండు దపాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుమారు పదేండ్ల అనంతరం మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాగ వేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సహన్ని నింపింది. దీంతో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్, సీపీఐ నాయకులు అనందోత్సహాలు చేసుకుంటు హర్షద్వనాలు వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రోడ్ల గుండా భారీగా ర్యాలీ నిర్వహిస్తూ..బాణసంచాలు, టపాసులు కాల్చుతూ.. రంగులు జల్లుకుంటూ విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు.
మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు..
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ విజయం సాధించడంపై మండల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు,సీపీఐ నాయకులతో కలిసి టపాసులు కాల్చుతూ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు.
నా విజయం..ప్రజా విజయం
ఉత్కంఠ భరితంగా సాగిన మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో ప్రజలే విజయసాదించారు. నా విజయం నియోజకవర్గ ప్రజల విజయం.కాంగ్రెస్ పార్టీని అదరించి భారీ మేజారిటీతో విజయతీరాలకు చేర్చిన మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞుడై ఉంటాను.
– డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఐఎన్ సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.
Spread the love