నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ లో చేసిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వేలో వివిధ కారణాలవల్ల పాల్గొనని వారు నేటి నుండి ఈ నెల 28 వరకు మీ యొక్క సమగ్ర వివరాలను నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆఫీసులో ప్రజా పాలన సేవా కేంద్రం ఏర్పాటు చేసేమన్నారు. దరఖాస్తుదారులు నేరుగా ఇట్టి సేవా కేంద్రానికి వచ్చి వారి యొక్క వివరాలు నమోదు చేసుకోవలన్నారు. దరఖాస్తుదారులు నేరుగా *http://seeepcsurvey.cgg.gov.in* లింక్ ఓపెన్ చేసి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకొని మున్సిపల్ ఆఫీసులో వివరాలు నమోదు చేసుకోవలాన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు వరకు అందుబాటులో ఉంటామన్నారు. లేదా టోల్ ఫ్రీ నెంబర్ 040 -21111111 కు నేరుగా కాల్ చేసి సర్వే కోసం అభ్యర్థించవచ్చునని పేర్కొన్నారు.