నవతెలంగాణ – డిచ్ పల్లి
బతుకు దేరువు కోసం గల్ఫ్ లోని దుబాయ్ కు వెళ్లిన కొన్ని రోజులకే మృత్యువాత పడ్డాడు.ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన బోండ్ల శ్రీనివాస్ (39) గత నెల 20న బతుకుదెరువు కోసం లేబర్గా దుబాయ్ కి వెళ్ళాడు. వెళ్లిన హైదర్ రోజులకి గుండెనొప్పి రావడంతో శ్రీనివాస్ మృతి చెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు తమ వంతు సహకారం చేసి మృతదేహానికి స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు వివరించారు. గతంలో సైతం గల్ఫ్ కు వెళ్లి వచ్చారని ఇక్కడ అప్పులు పెరిగిపోవడంతో పనులు చేసుకోవడానికి బతుకుదెరువు కోసమే కొన్ని ఏళ్ల తర్వాత దుబాయ్ కి వెళ్లినట్లు వారు వివరించారు. మృతునికి భార్య సుజాత ఒక కూతురు, కుమారుడు ఉన్నారు బుధవారం స్వగ్రామానికి మృతదేహం వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు.