అనుకున్నది సాధించాడంలో ఆయనకు మరేవ్వరు లేరు సాటి..

– బాజిరెడ్డి గోవర్ధన్ రాజకీయ ప్రస్థానం…
– గ్రామీణులతో మమేకం, మూడు తరాల వారి ఆదరణ..
– నాలుగుసార్లు ఎమ్మెల్యే, మూడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం  వైఎస్ఆర్, కేసీఆర్ కుటుంబాలతో ప్రత్యేక అనుబంధం..
– వేములవాడ రాజన్న కుల దైవం, తిరుపతి వెంకన్న ఇష్టదైవం.
నవతెలంగాణ -డిచ్ పల్లి
సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో కొనసాగుతున్న టిఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్ధన్ మొదటి నుంచి మాస్ ఇమేజ్ ”పొలిటికల్ రెబల్ స్టార్ గా” టైగర్ గా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. బాజిరెడ్డి గోవర్ధన్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.
నక్సలైట్ల తూటాతో గొంతు స్వరపేటిక దెబ్బతిన్నా.. ఎట్టకేలకు హతమర్చలనే ఉద్దేశంతో అనాడు మందుపాతర పేలి త్రుటిలో తప్పించుకున్నారు.తన కారును లారీ ఢీ కొట్టడంతో ఎడమ దవడ పగిలిపోయినప్పుటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో తన  ప్రజా ప్రస్థానాన్ని నాటి నుండి నేటి వరకు కొనసాగిస్తుఉన్నారు.నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్  మూడు నియోజకవర్గాలు ఆర్మూర్,డాన్స్ వాడ, నిజామాబాద్ రూరల్ లో ప్రాతినిధ్యం వహించారు.నిజామాబాద్ రూరల్ లో ప్రస్తుతం వాహిస్తున్నరు. గ్రామీణ ప్రాంత ప్రజలతో నిత్యం మమేకమయ్యే ఆయనకు మూడు తరాల వారితో అనుబంధం చెక్కు చేదరకుండా నేటి వరకు కోనసిగుతునే ఉంది.
నాడు ఎన్టీఆర్ పిలిచినా టీడీపీలో చేరలేదు..
1995లో పరిషత్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానల్ తో పోటీ చేశారు. ఫిబ్రవరి 17 1954 జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేట లోని అమ్మమ్మ ఇంట్లో పుట్టారు. సిరికోండ మండలంలోని చీమన్ పల్లి గ్రామంలో పెరిగి పెద్దయ్యారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామం బాజిరెడ్డి గోవర్ధన్ నానమ్మ ఊరు.1988-70లో ధర్పల్లిలో ఎస్ఎస్ సి విద్యనభ్యసించారు.1971 లో చిమన్ పల్లీ పోలీస్ పటేల్ గా ఉద్యోగంలో ఉంటు, హైదరాబాద్ లోని ఉస్మానియాలో ఓపెన్ డిగ్రీ (బీఏ) చేశారు.1981లో పోలిస్ పాటేల్ ఉద్యోగానికి రాజీనామా చేసి చిమాన్ పల్లి సర్పంచ్ గా నిలబడి మొట్టమొదటి సారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాజిరెడ్డి గోవర్ధన్ రాజకీయ గురువు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి  ప్రోత్సాహంతో నే నాడు సర్పంచ్ గా అయ్యారు.
1980లో కాంగ్రెస్ తరుపున సిరికొండ ఎంపిపీగా గెలిచారు. 
నక్సలైట్లు టార్గెట్ చేసిన.. మొక్కవోని పట్టుదలతో ముందుకు..
1991లో సిరికొండ సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనాడు మంత్రి గా ఉన్న శనిగరం సంతోష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గా చేస్తానని చెప్పి సంతోష్ రెడ్డి మాట తప్పడంతో సహకార సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.తరువాత ఆంధ్రప్రదేశ్ స్ట్రేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ అయ్యారు. నక్సలైట్లు టార్గెట్ చేసి రోడ్డు వద్ద మందు పాతరతో ప్రమాదం జరిగింది.
మరో మారు నక్సలైట్లు 1994లో నాపై కాల్పులు జరిపారు.
బుల్లెట్ గొంతులో దిగి కుడి భుజం గుండా బయటకు వెళ్లింది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో నెలరోజుల పాటు చికిత్స తీసుకున్నారు.బుల్లెట్ తగిలినందున స్వరపేటిక ఆనాటి నుండి నేటి వరకు దెబ్బతింది.1995లో అంబాసిడర్ కారులో వెళుతుండగా సిరికొండ- కొండూరు గ్రామల మధ్యలో నక్సలైట్లు మందుపాతర పేల్చారు.
ఆ పేలుడు నుంచి తప్పించుకున్నా. 
ఒక్కసారిగా పేలుడు జరగడంతో డ్రైవర్ కారు వేగంగా నడిపాడు. కారు మూడు పల్టీలు కొట్టింది. అంబాసిడర్ కారు కావడంతో బతికి బయట పడ్డాం. లేకపోతే అక్కడే చిక్కుకుని నక్సలైట్ల చేతిలో ఉండే వాడినని బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు.1996లో నిజామాబాద్ నగర శివారులోని బోర్గం వంతెనపై లారీ ఢీ కొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఎడమ దవడ పగిలిపోయింది.నెలల పాటు చికిత్స తీసుకున్నాను. వైఎస్ఆర్ 1999లో సంతోష్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ ఇచ్చి నాకు అర్మూర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.అర్మూర్ ఎమ్మెల్యే గా గెలిచాను.2004లో రాజకీయ సమీకరణలతో సంతోష్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్తిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్మూర్ నుంచి పోటీ చేశారు. 2004 వైఎస్ఆర్ చెప్పడంతో బాన్సువాడలో అసెంబ్లీకి పోటీ చేసి అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పై గెలుపొందాను.  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో గతంలో చంద్రబాబు హయాంలో అమ్మిన ప్రభుత్వ భూములపై వేసిన హౌజ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించాను. వీఏసీ సభ్యుడిగానూ కొనసాగాను. 1988లో వైఎస్ఆర్ నన్ను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఏఐసీసీ కార్యదర్శి జనార్దన్ పూజారికి నా గురించి వివరించారు.1999, 2004, 2009 ఎన్నికలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. 2014, 2018 లో కేసీఆర్ సహాయ సహకారాలతో వారి ప్రోత్బల్యంతో మరోసారి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు.
2008లో బాన్సువాడ నుంచి ఓటమి పాలయ్యాను..
2014లో వైఎస్సార్ సీపీని వీడి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ రూరల్ నుంచి అప్పటి పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ను ఓడించి గేలుపోంది చరిత్ర సృష్టించారు. పుణ్యక్షేత్రాలూ ఎక్కువగా తిరిగాను. ‘తానా’ సభల్లో పంచకట్టుతో పాల్గొన్నాను. సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి పంచ కట్టు పాటిస్తున్నాను.
ప్రస్తుతం బాజిరెడ్డి గోవర్ధన్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ టిఎస్ ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఆర్టీసీ ని ప్రగతి రథ చక్రాలను పరుగున పెట్టిస్తున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో టిఎస్ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థ ఉద్యోగుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
దినపత్రికలు, పుస్తకాలు ఎక్కువగా చదువుతాను.  ఇష్టం మైన వస్తువులు బ్రాండెడ్ పెన్నులు, వాచ్లు, కళ్ల గ్లాసులు ఎక్కువగా కొనడం. ఇష్టం. గతంలో ఎన్టీఆర్, శోభన్ బాబు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు అంటే ఇష్టం.
గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడమే తన ముందున్న ధ్యేయమని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
Spread the love