నవతెలంగాణ – హైదరాబాద్; కోల్‌కతా ట్రైనీ డాక్టర్ లైంగికదాడి కేసులో సంజయ్ రాయ్‌ని కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ దారుణం వెనుక మరికొందరు ఉన్నారని ఆమె ఆరోపించారు. వారికి కూడా శిక్ష పడ్డప్పుడే న్యాయం జరిగినట్లు భావిస్తామన్నారు. అప్పటివరకు తాము ప్రశాంతంగా నిద్రపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.