రామేశ్వరం కేఫ్‌లో పేలుడు..బాంబుకు టైమర్ సెట్‌ చేసి వెళ్లిపోయాడు

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్‌ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. దీనిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లనున్నట్లు చెప్పారు. అలాగే ఈ కేసు గురించి మాట్లాడారు. ‘‘మాస్క్, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చాడు. రవ ఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్‌ చేసి, వెళ్లిపోయాడు. అతడు ఎవరో తెలీదు. ఫొటోలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం. పేలుడులో గాయపడిన వ్యక్తులు ప్రస్తుతం కోలుకుంటున్నారు’’ అని తెలిపారు. ఈరోజు పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Spread the love