24 గంటలు కరెంటు ఇస్తే రాజీనామా చేస్తా

– బీజేపీ నేత ఈటల రాజేందర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు రుజువు చేస్తే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారంనాడిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదనీ, రూ. 25 వేల కోట్ల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని ప్రకటించి ఐదేండ్లు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు. రైతులకు కొత్త రుణాలు ఇవ్వట్లేదనీ, ప్రభుత్వం భూములమ్మి ఖజానా నింపుకొనే పనిలో ఉందని ఎద్దేవా చేశారు.

Spread the love