గుత్తి కోయ గూడెంలో హెల్త్ క్యాంప్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని మచ్చాపూర్ గుత్తి  కోయగూడెం లో సోమవారం కాలినడకన 5 కిలోమీటర్లు నడిచి  డాక్టర్ సుకుమార్  ఆధ్వర్యంలోహెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంపులో 68 మంది పరీక్ష నిర్వహించడం జరిగింది. హౌస్ టు హౌస్  ఫీవర్ సర్వే చేయడం జరిగింది. వీటిలో ఆరుగురికి జ్వరం, రెండు మలేరియా  కేసులు ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది.  నాలుగు గర్భిణీ స్త్రీలకు చూడడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ గుత్తి కోయలకు ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాలను వివరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో  హెచ్  ఈవో సురేష్ కుమార్,  సబ్ యూనిట్ ఆఫీసర్  భూపాల్ రెడ్డి,  హెల్త్ అసిస్టెంట్ జంపయ్య, కృష్ణయ్య, ఆశాలు సరిత, రజిత పాల్గొన్నారు.
Spread the love