ఏసీబీ వలలో న‌ల్ల‌కుంట ఫీవ‌ర్ ఆస్పత్రి హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్..

నవతెలంగాణ-హైద‌రాబాద్ : హైద‌రాబాద్ ప‌రిధిలోని న‌ల్ల‌కుంట ఫీవ‌ర్ హాస్పిట‌ల్ హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. ఓ మ‌హిళ వ‌ద్ద లంచం తీసుకుంటుండ‌గా అధికారులు హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌టేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ కింద స్వీప‌ర్ పోస్టు ఇచ్చేందుకు వెంక‌టేశ్ డ‌బ్బులు డిమాండ్ చేశాడు. రూ. 15 వేలు ఇస్తేనే స్వీప‌ర్ పోస్టు ఇస్తాన‌ని వెంక‌టేశ్ స్ప‌ష్టం చేశారు. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించింది. ఇవాళ మ‌హిళ వ‌ద్ద నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండ‌గా హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న కార్యాల‌యంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు ఏసీబీ అధికారులు.

Spread the love