ఆటలతోనే ఆరోగ్యం అదే మెడికవర్‌ హాస్పిటల్స్‌ కర్తవ్యం

నవతెలంగాణ- హైదరాబాద్‌
ఆటలతోనే ఆర్యోగ్యమని, అదే మెడికవర్‌ హస్పిటల్స్‌ లక్ష్యమని ఎగ్జీక్యూటీవ్‌ డైరెక్టర్‌ హరికృష్ణ అన్నారు. మెడికవర్‌ హాస్పిటల్స్‌ వివిధ విభాగాల వైద్యులు, ఎన్‌సీసీ గార్డెనియా మెంబర్స్‌ మధ్య శుక్రవారం క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. అనంతరం డాక్టర్‌ మిథిల్‌ ఘుసే మాట్లాడుతూ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆటలతో మెదడు ఆరోగ్యానికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యకరమైన అభివద్ధికి ఆటలు అవసరమన్నారు. పిల్లలు వాళ్ళకి తెలియని వాటిని కూడా ఆచరించడానికి, సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి, ఉత్తమ వ్యూహాలను రూపొందించడానికి క్రీడలు అవసరమన్నారు. ఆటలు అవుట్‌డోర్‌ యాక్టివిటీస్‌, ఫిజికల్‌ స్టామినా, ఫిట్‌నెస్‌ని పెంచడానికి సహాయపడతాయన్నారు. ఆరుబయట ఆటలు కండరాలు, ఎముకలను బలోపేతం చేయడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు వివిధ తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెప్పారు. ఈ మ్యాచ్‌లో మెడికవర్‌ హాస్పిటల్స్‌ కెప్టెన్‌ వీఎల్‌. కేశవరెడ్డి, ఎన్‌సీసీ కెప్టెన్‌ మోజెస్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హరికష్ణ, డాక్టర్‌ సతీష్‌కుమార్‌ కైలాసం, డాక్టర్‌ మిథిల్‌ఘుసే. మెడికవర్‌ నుంచి చాలా మంది ఆడారు.

Spread the love