చిరుధాన్యాలతో ఆరోగ్యం పదిలం

– పీస్‌ సంస్థ డైరెక్టర్‌ నిమ్మయ్య
నవతెలంగాణ-జగదేవపూర్‌
జగదేవపూర్‌ మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శనివారం నాడు పిస్‌ సంస్థ డైరెక్టర్‌ నిమ్మయ్య ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు చిరుధాన్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిరుధాన్యాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా బాలికలు చిరుధాన్యాలను రోజువారి ఆహారంతో కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అని తెలిపారు. దానివల్ల తమ ఆరోగ్యానికి సంబంధించి పూర్తిస్థాయిలో పోషకాలు లభిస్తాయని అన్నారు. అలాగే మొలకెత్తిన శనగలు, పెసర్లు తీసుకోవడం వల్ల సమతుల్యమైన ఆహారాన్ని భుజించిన వాళ్ళు అవుతారని అన్నారు . జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారే ఉత్తములని తెలిపారు. బాలికలు భవిష్యత్తులో రకరకాల వ్యాధులకు గురికాకుండా ఉండాలంటే ఇప్పటినుండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచించారు. కందుల పెసళ్ళు, మొక్కజొన్న లు, ఉలవలు, సజ్జలు, రాగుల వాటి వాటిని తినడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ స్లివ రాజ్‌, ఉపాద్యాయులు,శశికళ, నవనీత, పిటి అనంత రాములు చారి, పీస్‌ సమస్త కో ఆర్డినేటర్‌ కొంపల్లి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love