ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలుకెళ్లిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఈడీతో పాటు సీబీఐ సైతం వాదనలు వినిపించే అవకాశం ఉంది. కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు.

Spread the love