అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా…

నవతెలంగాణ – హైదరాబాద్
వైఎస్ వివేకా హత్య కేసులో ఏ8గా పేర్కొన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వెకేషన్ బెంచ్ ముందు నేడు కేసును మెన్షన్ చేశారు. అవినాశ్ పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైనవని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. హైకోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయని… అవినాశ్ బెయిల్ ను సీబీఐ కూడా వ్యతిరేకిస్తోందని చెప్పారు. హత్యకు సంబంధించి అవినాశ్ కీలక సూత్రధారుడని ఆరోపించారు. మరోవైపు ఈ పిటిషన్ పై వాదలను మంగళవారం వింటామన్న జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్ తో కూడిన ధర్మాసనం… విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Spread the love