చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

నవతెలంగాణ-హైదరాబాద్ : ఫైబర్‌ నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం .. తదుపరి విచారణను డిసెంబరు 12తేదీకి వాయిదా వేసింది. గత నెల 13, 17, 20, నవంబరు 9 తేదీల్లో ఇదే పిటిషన్‌ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో అందులో తీర్పు ఇచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తులు గత విచారణ సమయంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడక పోవడంతో విచారణ మరోసారి వాయిదా పడింది.

Spread the love