నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పైన నేడు ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఇరు పక్షాలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు గురించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక, ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఐడీ తరపున ముఖుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. కాగా, దీంతో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం వెలడిస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన విచారణ పూర్తైంది. తీర్పును న్యాయస్తానం రిజర్వ్ చేసింది. ఆ తీర్పు ఇప్పుడు చంద్రబాబు కేసులకు కీలకం కాబోతుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 53 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ వచ్చినా.. అనారోగ్య కారణాలతో రెస్ట్ తీసుకున్నారు.

Spread the love