నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల లడ్డూ వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నిన్ననే విచారణ జరగాల్సి ఉండగా సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును కొనసాగించాలా? లేదా స్వతంత్ర సంస్థలకు అప్పగించాలా? అనేది నేడు న్యాయమూర్తులు తేల్చనున్నారు.