నవతెలంగాణ – హైదరాబాద్: శ్రావణ మాసం ఎఫెక్ట్ మళ్లీ చికెన్ ధరలపై పడింది. బుధవారం మరోసారి చికెన్ ధరలు మరింత పడిపోయాయి. మరోవైపు సీజన్ వ్యాధులు చికెన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత నెల 27 వరకు కిలో స్కిన్ చికెన్ ధర రూ.180, స్కిన్ లెస్ చికెన్ రూ.200లుగా ఉంది. గత నెల 28న కిలో స్కిన్ చికెన్ రూ.165, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.188కి పడిపోయింది. అంటే అప్పట్లో కిలో స్కిన్ చికెన్‌కు రూ.15 , స్కిన్లెస్ చికెన్‌కు రూ.12 ధర తగ్గింది. తాజాగా బుధవారం చికెన్ ధరలు మళ్లీ తగ్గాయి. మంగళవారం వరకు లైవ్ కోడి కిలో రూ.114 ఉండగా, స్కిన్ చికెన్ రూ.165, స్కిన్ లెస్ రూ.188గా ఉంది.