హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ నగదు

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో లోక్​సభ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ సోదాలు చేపడుతూ అక్రమ నగదు రవాణాకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మంగళవారం నాడు హైదరాబాద్​లోని దారుస్సలాం ఔట్​పోస్ట్‌ వద్ద భారీగా నగదు పట్టుబడింది. మంగళ్​హాట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొత్త రవిచంద్ర, సురేశ్, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోక్ తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు చెప్పారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల వేళ బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అనుమానం వచ్చిన బ్యాంక్ అకౌంట్​లపై పోలీసులు పోలీసులు నిఘా పెంచారు.

Spread the love