భారీగా అల్పాజోలం పట్టివేత..

నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఇతర ప్రాంతాల నుండి మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు బాన్సువాడ ఎక్సైజ్ శాఖ సీఐ యాదగిరి రెడ్డి తెలిపారు. అల్పాజోలం మత్తు కోసం కల్లులో కలిపే మత్తు పదార్థంను మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన గరిగే బాలకృష్ణగౌడ్ కారులో మత్తు మందు తరలిస్తుండగా మంగళవారం హాసన్ పల్లి చౌరస్తా రోడ్ వద్ద బాన్సువాడ ఎక్సైజ్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. ఇందులో భాగంగా 1.150 కేజీల అల్పాజోలం ను కారు ను బాన్సువాడ ఎక్షైజ్ అధికారులు పట్టుకున్నారు. విచారణ చేపట్టగా మెదక్ నుండి ఓ అజ్ఞాత వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఇతరులకు అధిక ధరకు విక్రయించడానికి 3 లక్షల విలువ గల మత్తు మందు కొనుగోలు చేసినట్లు బాల కృష్ణ ఒప్పుకున్నాడని బాన్సువాడ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్ పెక్టర్ యాదగిరి రెడ్డి తెలిపారు. వీరి నుండి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారని. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు మూడు లక్షల రూపాయల విలువ ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై తేజస్విని శ్రీకాంత్ సందీప్ నాగరాజ్ అయుబ్ తదితులున్నారు.

Spread the love