డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ భారీ ఓటమి

నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మరోభారీ షాక్‌ తప్పలేదు. గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ ఇచ్చిన షాక్‌ నుంచి కోలుకోకముందే సఫారీలు ఇంగ్లీష్‌ జట్టుకు మరో భారీ షాకి చ్చారు. ముంబైలోని వాంఖెడే వేదికగా ముగిసిన హైస్కోరింగ్‌ థ్రిల్లర్‌లో అన్నిరంగాలలో రాణించిన సఫారీలు.. బట్లర్‌ గ్యాంగ్‌ను చావుదెబ్బకొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్‌.. 22 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఫలితంగా సఫారీలు 229 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా మూడో స్థానానికి చేరగా ఇంగ్లండ్‌ 9వ స్థానానికి పడిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో మూడో ఓవర్లోనే తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. ఏ దశలోనూ పుంజుకోలేదు. సఫారీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి డిఫెండింగ్‌ ఛాంపియన్లు ఊపిరితీసుకోనీయకుండా చేశారు. బెయిర్‌ స్టో (10)తో పాటు జో రూట్ (2) డేవిడ్‌ మలన్‌ (6), బెన్‌ స్టోక్స్‌ (5) లు నిరాశపరిచారు. రబాడా వేసిన అదే ఓవర్లో 4, 6 బాదడంతో ఇంగ్లండ్‌ స్కోరు 50 పరుగులకు చేరింది. కొయెట్జ్‌ వేసిన పదో ఓవర్లో బట్లర్‌ ( .. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు. కానీ అతడే వేసిన 12వ ఓవర్లో బట్లర్‌.. డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇదే ఓవర్లో మూడో బంతికి హ్యారీ బ్రూక్‌ (17) కూడా ఔటయ్యాడు. అదిల్‌ రషీద్‌ (10)ను కోయెట్జ్‌ .. 15వ ఓవర్లో తొలి బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.
101 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన మార్క్‌ వుడ్‌.. సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మార్కో జాన్సెన్‌ వేసిన 18వ ఓవర్లో వుడ్‌.. రెండు సిక్సర్లు, ఒక బౌండరీ కొట్టాడు. వుడ్‌తో పాటు రబాడా వేసిన 21వ ఓవర్లో అట్కిన్సన్‌.. నాలుగు బౌండరీలు బాదాడు. కేశవ్‌ మహారాజ్‌ వేసిన 22వ ఓవర్లో మార్క్‌ వుడ్‌ ఒక ఫోర్‌, రెండు భారీ సిక్సర్లు కొట్టినా అదే ఓవర్లో అట్కిన్సన్‌ను మహారాజ్‌ బౌల్డ్‌ చేశాడు. సఫారీ చివరి వరుస బ్యాటర్‌ రీస్‌ టాప్లీ గాయం కారణంగా బ్యాటింగ్‌ కు రాలేదు. దీంతో ఇంగ్లండ్‌.. 170 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా 229 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

Spread the love