- కుల సంఘాల భవనాలలో ఉన్నట్లు సమాచారం
నవతెలంగాణ కంటేశ్వర్: అసెంబ్లీ ఎన్నికలు 2023 జరుగుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు భారీగా మద్యాన్ని కుల సంఘాల భవనాలలో డంపింగ్ చేసి ఆయా కాలనీలలో మద్యాన్ని బుధవారం ఉదయం నుంచే పంచడం మొదలుపెట్టారు. పోలీసులు ఎంత నిగా పెట్టిన డంపింగ్ చేసిన మద్యాన్ని అక్రమంగా ఇంటింటికి తరలిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల మధ్యాన్ని పొందుపరిచారు. మగవారికి మద్యం పంచుతూ మహిళలకు డబ్బులు ఇస్తూ ఎన్నికలలో ఓట్లను వేసేందుకు విస్తృత ప్రయత్నాలు ప్రముఖ పార్టీలు చేస్తున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు నిజాయితీగా ఓటు వేయాలని చూస్తే ప్రలోభాలకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజలు అంటున్నారు. ఎన్నికల కమిషన్ విధించిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఎన్నికల నేపథ్యంలో ఎవరు పాటించలేకపోతున్నారని తెలుస్తోంది.