శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. బుధవారం కువైట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న 559 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెయిర్ క్రీమ్లో దాచిపెట్టి 2 బంగారు ముక్కలు, రోడియం పూసిన 4 బంగారు గాజులు, రోడియం పూసిన బంగారు ఉంగరాలు, ఒక బ్రాస్లెట్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.33.12 లక్షలు ఉంటుందన్నారు.

Spread the love