హైదరాబాద్‌లో భారీగా బంగారం చోరీ..

Heavy gold theft in Hyderabad నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ దోపిడీ జరిగింది. దోమల్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అరవింద్ కాలనీలో ఓ బంగారం వ్యాపారి, అతని సోదరుడి ఇళ్ల నుంచి సినీ ఫక్కీలో 2.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బంగారం వ్యాపారి రంజిత్, అతని సోదరుడి ఇళ్లలోకి పదిమంది దుండగులు జొరబడ్డారు. దుండగులు వారిని కత్తులు, తుపాకులతో బెదిరించి లాకర్‌లో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. బంగారంతో పాటు మూడు ఫోన్లు, ఐ ట్యాబ్, సీసీటీవీ డీవీఆర్‌ను దొంగిలించారు. దుండగులను అడ్డగించే ప్రయత్నం చేసిన వ్యాపారి రంజిత్‌కు గాయాలయ్యాయి

Spread the love