సీబీఐ ఆఫీస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు…

నవతెలంగాణ – హైదరాబాద్ : వివేకా హత్య కేసులో విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి నేటి ఉదయం 10:30 గంటలకే ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ అవినాష్ రెడ్డి ఇప్పటికీ సీబీఐ కార్యాలయానికి బయలుదేరలేదు. ఇంకా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి నివాసానికి న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే ఆయన మద్దతుదారులు, అనుచరులు సైతం భారీగా చేరుకున్నారు. తన నివాసంలో న్యాయవాదులతో అవినాష్ రెడ్డి చర్చిస్తున్నారు. నేడు అవినాష్ రెడ్డినీ సీబీఐ అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళతారా? లేదా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఏపీలో అవినాష్ విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా? లేదా? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అవినాష్ అరెస్ట్ పక్కా అని సమాచారం రావడంతో పులివెందుల నుంచి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే నివాసం దగ్గర.. సీబీఐ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మొత్తానికి వైసీపీలో టెన్షన్ మొదలైంది.

Spread the love